ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారికి టయోటా రైడర్..కానుకగా సమర్పించిన భక్తుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 07:46 PM

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు టయోటా రైడర్స కానుకగా సమర్పించాడు. ఇదిలావుంటే తిరుమల వెంకన్నకు అందే కానుకలకు అంతే లేదు. నిత్యం ఏదో ఒక రూపంలో స్వామివారి ఖజానా కళకళలాడుతుంటుంది. చాలామంది వాహన రూపేణా కూడా శ్రీవారికి కానుకలు, విరాళాలు అందిస్తుంటారు. తాజాగా, హర్ష టయోటా షోరూం ఎండీ ఎం.హర్షవర్ధన్ వెంకటేశ్వరస్వామికి టయోటా రైడర్ కారును విరాళంగా సమర్పించారు. ఇవాళ ఆలయం వద్దకు కారును తీసుకువచ్చిన హర్షవర్ధన్... కారు తాళాలను ఆలయ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కారుకు పూజలు చేసి చక్కగా ముస్తాబు చేశారు. గతంలోనూ హర్ష టయోటా సంస్థ తిరుమల శ్రీవారికి వాహనాన్ని బహూకరించినట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com