హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం రాత్రి 7.30కి మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ 1-1తో సమం అయింది. సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ కావడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2500ల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అభిమానులు సెల్‌ఫోన్లు స్టేడియంలోకి తీసుకెళ్లొచ్చు. ఫ్యాన్స్ కోసం మెట్రో సేవలు అర్ధరాత్రి 1 వరకు కొనసాగనున్నాయి
![]() |
![]() |