విశాఖపట్నం: చోడవరం మండలం గోవాడ లో ఒక వివాహితీ అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలం చేరుకుని పరిస్థితి పరిశీలించారు. గురువారం రాత్రి అందిన సమాచారం కొరకు చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పాము వెంకటేష్ భార్య భారతి గోవాలో గల తమ వ్యవసాయ పొలంలోకి యధా ప్రకారం గురువారం మధ్యాహ్నం గడ్డి కోసం వెళ్ళింది. సాయంత్రం అయినా ఆమె ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఇలాగా పంట పొలాల్లో మహిళ మృతి చెంది ఉండడానికి స్థానికులు గుర్తించి సమాచారం అందించారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు అనకాపల్లి డి. ఎస్. పి సునీల్, చోడవరం ఎస్ఐ యమునా తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితి పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. అయితే గడ్డి కోసం వెళ్ళిన ఆ మెడలో ఉన్న బంగారం కోసమే ఎవరైనా హత్య చేసి ఉంటారు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సిందే. అన్ని కోణాలు లోనూ విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మృతురాలకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.
![]() |
![]() |