కుటుంబ సమేతంగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నసీఎం చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 10:50 AM
 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మంత్రి నారా లోకేష్‌, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాత్రి అక్కడే బసచేశారు. ఈ రోజు ఉదయం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమల చేరుకుని వెంకన్నను దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.