తమిళనాడులో వైభవంగా సంక్రాంతి వేడుకలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 10:38 AM
 

తమిళనాడులో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మదురైలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలు మొదలయ్యాయి. మదురై కలెక్టర్‌ జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. జల్లికట్టులో మొత్తం 974 ఎద్దులు పాల్గొంటున్నాయి. జల్లికట్టు పోటీల సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోటీలో పాల్గొనే వారి ఆధార్‌ కార్డులను సేకరించారు. తమిళనాడు రాష్ట్రంతో పాటు ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జల్లుకట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాలో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తున్నారు.