రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 10:31 AM
 

నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు టీపీ గూడూరు వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.