ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 09:14 AM
 

విజయవాడ:  ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఉదయం చిన్న రాజగోపురం వద్ద భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది ప్రత్యేక అలంకరణ చేశారు. సంక్రాంతి సందర్భంగా దేవస్థానం దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ మహా మండపంలో బొమ్మల కొలువు నిర్వహించనుంది. నేటి నుంచి ఈ నెల 16 వరకు బొమ్మల కొలువు నిర్వహించనున్నారు.