నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబం భోగి వేడుకలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 09:01 AM
 

నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం సందడి చేస్తోంది. మూడు రోజుల పాటు సొంత ఊరైన నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకోనున్నారు. ఇవాళ ఉదయం నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబం భోగి వేడుకలు జరుపుకుంది. ఇంటి ముందు భోగి మంటలు వేసి చంద్రబాబు కుటుంబం బాలయ్య కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకున్నారు.