తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండుగ

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 09:00 AM
 

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇరు రాష్ట్రాల ప్రజలు ఇవాళ బోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయమే భోగి మంటలు వేసి పండుగకు స్వాగతం పలికారు. తెలుగు ప్రజలు తమ ఇళ్ల ముందు, ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వేసుకున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు భోగి మంటలతో కళకళలాడుతున్నాయి.  పల్లెల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా పిల్లలు, మహిళలు ఆటాపాటలతో సందడి చేస్తున్నారు. కొత్త బట్టలు, పిండి వంటలతో తెలుగు ప్రజలు భోగి పండుగను జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.