ఐటీ మంత్రి లోకేష్‌తో చైనా కంపెనీ సీఈవో భేటీ

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 01:10 PM
 

అమరావతి: రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో చైనాకు చెందిన ఆలీబాబా కంపెనీ సీఈవో వండర్‌యాంగ్‌ శనివారం భేటీ అయ్యారు. వండర్‌యాంగ్‌ను మంత్రి లోకేష్‌ వద్దకు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తీసుకుని వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల విక్రయాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆలీబాబా కంపెనీ ఓ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. దీనివలన రాష్ట్రంలో 20వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా... దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆలీబాబా కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోనుంది.