మ‌హారాష్ట్ర‌లో గే పెళ్లి చేసుకున్న టెకీ

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 10:00 AM
 

యావత్మల్: అమెరికాలో ఉంటున్న భారత సంతతి ఇంజినీర్ గే వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని యావత్మల్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీని ఈ స్వలింగ సంపర్క వివాహం జరిగినట్లు తెలుస్తున్నది. యావత్మల్‌కు చెందిన 40 ఏళ్ల హృషి మోహన్‌కుమార్ సత్వానే అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల ఆశీస్సులతో అతను పెళ్లి చేసుకున్నాడు. వియత్నాంకు చెందిన విన్‌ను తన భాగస్వామిగా మార్చుకున్నాడు. యావత్మల్‌లో ఎస్పీ కార్యాలయానికి కొంత దూరంలోనే ఈ గే మ్యారేజ్ జరిగింది. హృషి మోహన్‌కుమార్ బాంబే ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలో గ్రీన్ కార్డు హోలర్డ్ అతను. మొదట్లో అతని పేరెంట్స్ గే మ్యారేజ్‌కు అంగీకరించలేదు. కానీ చివరకు పెళ్లికి ఓకే చెప్పేశారు.