చెన్నై విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 09:59 AM
 

చెన్నై విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విమానాశ్రయంలో పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు చెన్నై వచ్చే 12 విమానాలను దారి మళ్లించారు. చెన్నై విమానాశ్రయం నుంచి వెళ్లే 30 విమానాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.