ఢిల్లీని త‌ల‌పిస్తోన్న కృష్ణాజిల్లా ..

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 09:56 AM
 

కృష్ణాజిల్లా మరోసారి ఉత్తర భారతదేశాన్ని తలపిస్తుంది. నందిగామ కంచికచర్ల జాతీయ రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే సంక్రాంతి పండుగకు త్వరగా ఇంటికి వెళదామనుకున్నానే వాహనదారులను పొగమంచు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంది. తెల్లవారుజాము నుండే పోలీసులు జాతీయ రహదారిపై పహారా కాస్తూ వేగ నియంత్రణ చేపట్టినప్పటికీ అక్కడక్కడ స్వల్ప ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు గుర్తుపట్టలేక ద్విచక్రవాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ వైపు నుండి కార్లు బైకులు అధిక సంఖ్యలో రావడంతో ఎదురుగా వెళ్తున్న వాహనదారులు పొగమంచు కారణంగా హడలిపోతున్నారు