తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 09:02 AM
 

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మొత్తం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతున్నది. నిన్న శ్రీవారిని 55,963 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 22,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.09 కోట్లు.