న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఓ మూలస్తంభంగా ఉండాలి : మాజీ న్యాయశాఖ మంత్రి

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 04:40 PM
 

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మరో నలుగురు న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదుపై మాజీ న్యాయశాఖ మంత్రి హన్సరాజ్ భరద్వాజ్ స్పందించారు. ఆ ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానం తన గౌరవాన్ని కోల్పోయిందన్నారు. ఒకసారి ప్రజల విశ్వాసం సన్నగిల్లితే, ఇక అందులో ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి ఓ మూలస్తంభంగా ఉండాలని, అత్యున్నత న్యాయస్థానం ఎలా పనిచేస్తుందన్న అంశాన్ని చూసుకోవాల్సిన బాధ్యత న్యాయశాఖ మంత్రిదే అని హన్సరాజ్ ఆరోపించారు. అయితే జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలో ఇవాళ ముగ్గురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి విన్నవించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, లాయర్ కపిల్ సిబల్ కలవనున్నారు. తమ ఆవేదన వెలిబుచ్చిన జస్టిస్ చలమేశ్వర్‌ను ఇవాళ సీపీఐ ఎంపీ డీ రాజా కలిశారు.