ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో క్రీడాభివృద్ధికి సహకరిస్తా: కుంబ్లే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 03:07 PM

స్వామి వివేకానంద జీవితాన్ని నేటి యువత మార్గదర్శకంగా తీసుకుని ముందు కెళ్లాలని భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సూచించారు. వివేకానంద సూక్తులు పాటిస్తే ఎంతటి వారైనా జీవితంలో విజయాన్ని సాధిస్తారని అన్నారు.  స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో కుంబ్లే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్. వి.సుబ్రమణ్యం, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రపంచస్ధాయి క్రీడా సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు బాగున్నాయని కుంబ్లే కొనియాడారు. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తన్నారన్న ఆయన.. ప్రపంచ స్ధాయి క్రీడాకారుల రూపకల్పనలో రాష్ట్రానికి తనవంతుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యువతీ యువకులు  క్రీడలను అలవర్చుకోవాలని.. అవి జీవితంలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా ఉన్నత స్ధితికి చేర్చేలా ఉపకరిస్తాయన్నారు.


వివేకానందుని జీవితం నేటి తరానికి స్పూర్తి అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.  యువతను మంచి మార్గంలో నడిపించేందుకు రాష్ట్ర  ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com