ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరి కొద్ది సేపటిలో పీఎస్ఎల్వీ సి-40 రాకెట్ ప్రయోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 08:52 AM

శ్రీహరి కోట్ :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది.   పీఎస్ఎల్వీ సీ-40 రాకెట్ ను మరి కొద్ది సేపటిలో ప్రయోగించనుంది. ఆ రాకెట్‌ ప్రయోగానికి  నిన్న ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రోజు ఉదయం 9.28 గంటలకు ఇస్రో శ్రీహరికోట నుంచి రాకెట్‌ను ప్రయోగించనుంది. పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్‌ ద్వారా మొత్తం 1323 కిలోల బరువు కలిగిన 2 దేశీయ, 28 విదేశీ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనుంది. స్వదేశానికి చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలతో పాటు అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com