పోలవరం కొత్త టెండర్లు ఈనెల 18 వరకు వాయిదా

  Written by : Suryaa Desk Updated: Thu, Jan 11, 2018, 04:02 PM
 

పోలవరం ప్రాజెక్టు కొత్త టెండర్లు ఈనెల 18వరకు వాయిదా వేశారు. ఈనెల 16వతేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. రేపటితో ముగుస్తున్న పోలవరం కొత్త టెండర్లు గడువు.  మీడియాతో ఆయన మాట్లాడుతూ వారం తర్వాత టెండర్లు పిలిచి ముందుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. పునరావాస ప్యాకేజీ విషయంలో సవరించిన అంశాలు అధ్యయనంలో ఉన్నాయన్నారు. అన్ని వసతులు కల్పిస్తే పీపీఏ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామన్నారు. అక్టోబర్ నాటికి స్పిల్ వే పూర్తయితే.. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశముందన్నారు.