ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమష్టి కృషితోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:24 AM

 -ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు అందరు కృషి చేయాలి
 -పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
 -ఆత్మీయ సభలో రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు

సూర్యప్రతినిధి, ఒంగోలు:తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులను గెలిపు సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు పేర్కొన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నగరంలో పాటిబండ్ల కన్వెన్షన్‌ మాలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి శిద్ధా మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికలలో  పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్ధిగా వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్ధిగా వాసుదేవ నాయుడులు పోటీ ఉన్నారని వారిద్దరి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా ఈ ఎన్నికలను తీసుకొని పని చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులతో పాటు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.  ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందిలో ఉన్నప్పటికి ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ అందించడం జరిగిందన్నారు.  రెండున్నర సంవత్సరం అధికారంలో  ఎన్నో సంక్షేమ పథకాలను  ప్రవేశపెట్టి  అభివృద్ధిచేయడం జరిగిందన్నారు. 1600 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాషా్టన్న్రి ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఆ ఘనత  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.  అన్ని విషయాల్లో  ముందుండడం టిడిపి ఆలోచనా సరళికే నిదర్శనమన్నారు. రాష్ట్రం అభివృద్దిలో వేగంగా దూసుకుపోతుందన్నారు.
     గతంలో  రోడ్లలన్నీ గుంతలమయంగా ఉండేవని తాను మంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి  రోడ్లు అద్దాలు లాగా తయారు చేసి, ప్రయాణ సౌలభ్యం  సులభతరం చేసినట్లు మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు.
 రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ  ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి  విద్య, వైద్య,  ఆరోగ్య రంగాలలో  ఎన్నడూ లేని  విధంగా  ప్రజలకు చేరువయ్యేటట్లు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.  విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి పేద విద్యార్ధులు కూడా విదేశాలలో చదువుకునే విధంగా అవకాశాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి  నిధులను కేటాయించడమే కాకుండా  వారికి అందే విధంగా  చర్యలు తీసుకుంటున్న ఘనత మన ప్రభుత్వందేనన్నారు. పేద విద్యార్ధులకు  స్కాలర్‌షిప్‌లు అందించి విద్యాభివృద్దికి తోడ్పడడం జరిగిందన్నారు. టిడిపి బలపరచిన అభ్యర్దులను గెలిపించి  అధికారంలో ఉన్న ప్రభుత్వం ద్వారా లబ్దిపొందాలని పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మాట్లాడుతూ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల్లో వున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులను వ్యక్తి గతంగా కలిసి ఓట్లను అభ్యర్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఇతర ఉపాధ్యాయ సంఘాలు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com