హిమాచల్ ప్రదేశ్ లో అధికారం కైవసం చేసుకునే దిశగా బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నప్పటికీ…ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ మాత్రం ఓటమి ముప్పును ఎదుర్కొంటున్నారు. సుజన్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న ప్రేమ్ కుమార్ ధుమాల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కంటే 17 వందల ఓట్లు వెనుక బడి ఉన్నారు.