బెంగళూరు: ఒకప్పటి పోర్న్తార, బాలీవుడ్ నటి సన్నీలియోన్కి వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నగరంలో నిర్వహించనున్న కొత్త సంవత్సర వేడుకల్లో సన్నీ పాల్గొననుంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే మాన్యతా టెక్ పార్కు ఎదుట ఆమె ఫోటోలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ సంస్కృతిని అవమానించడమేనని వారు పేర్కొంటున్నారు. ఈ నూతన సంవత్సర వేడుకలను ఆపాలని, లేకపోతే యువసేన సంఘం కార్యకర్తలు డిసెంబరు 31న ముకుమ్మడి ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ మాట్లాడారు. ‘సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే పర్వాలేదు. కానీ చిన్న చిన్న బట్టలేసుకొని చిందులేస్తానంటే మేము సహించబోమన్నారు.