ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 12:26 PM

న్యూఢిల్లీ: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుశ్యంత్ చౌతాలా ఇవాళ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ట్రాక్టర్‌పై ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే గేటు వద్దే ఆయన వాహనాన్ని ఆపేశారు. ఇవాళ్టి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొంత మంది అనుచరులతో ఆయన ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. హర్యానా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలా మనువడే దుశ్యంత్ చౌతాలా. మాజీ ప్రధాని దేవిలాల్‌కు కూడా దుశ్యంత్ ముని మనవడు అవుతాడు. పార్లమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయసు కలిగిన ఎంపీ కూడా దుశ్యంత్ కావడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com