బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిసినట్లుగా ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ చైనీయులకు పెద్దగా తెలియదు. అయితే పలు చైనా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులకు ఇవాంక పేరుతో లేదా అలా వినిపించే పేర్లతో ట్రేడ్‌మార్క్‌ల కోసం తెగ ఆరాటపడుతున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇవాంక ట్రేడ్‌మార్క్ కోసం చైనా కంపెనీలు బాగా ప్రయత్నిస్తున్నట్లు చైనా ట్రేడ్‌మార్క్ కార్యాలయం రికార్డ్స్ ద్వారా వెల్లడైంది. గత ఏడాది నవంబరు 10 నుంచి డిసెంబరు చివరి వరకు ఇవాంక, ఇవాంక ట్రంప్, అలాగే ధ్వనించే రకరకాల పేర్లతో ట్రేడ్ మార్క్‌ల కోసం 258 దరఖాస్తులు వచ్చాయట. అయితే వీటిల్లో ఏ ఒక్క కంపెనీకి కూడా ఇవాంక ట్రంప్‌తో నేరుగా వ్యాపార సంబంధాలు లేకపోవడం గమనార్హం. కానీ చాలా కంపెనీలు ఇవాంక ఫేమ్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.