నెల్లూరులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కనే పార్క్ చేసిన వాహనాల మీదుకు దూసుకొచ్చింది. ఈ ఘనటలో 8 బైక్ లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అయితే ప్రజలు సమీపంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.