దంగల్ నటి జైరా వసీమ్‌కు విమానంలో లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయి… తనను తాకతు తోటి ప్రయాణికుడు చేసిన వెకిలి చేష్టలపై సదరు విమానయాన సిబ్బందికి ఆమె ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఓ వీడియోను ఉంచి ఆవేదన వ్యక్తం చేసిందామె… ఈ ఘటనపై ఆమె కేంద్రం సీరియస్‌గా స్పందించింది… ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు విస్తారా యాజమాన్యాన్ని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. దీంతో ముంబైలో జైరా బస చేసిని హోటల్‌కి వెళ్లి పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరోవైపు విమానంలో జైరా వసీమ్‌కు లైంగిక వేధింపులపై జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్‌గానే స్పందించింది. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విస్తారా యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది… జైరా ఘటనను సుమోటోగా స్వీకరించి విస్తారాకు నోటీసులు ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఆ విమానయాన సంస్థపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపినట్టు పేర్కొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ… ఆమెకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.