ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ అర్హతతో 3259 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 08:03 AM

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఎల్డీసీ, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2017కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సోర్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం అందజేస్తారు.


కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ ఎగ్జామినేషన్ 2017


పోస్టుల సంఖ్య: 3259; ఎల్డీసీ- 898, సోర్టింగ్ అసిస్టెంట్ 2359, డీఈఓ 2


విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్‌లో సైన్స్, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ స్కిల్స్ ఉండాలి.


వయోపరిమితి: 2018 ఆగస్టు 01 నాటికి 18 నుంచి 27 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మిగతా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. టైర్-1లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు 200 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి టైర్-2 నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి రాత నైపుణ్యాలను పరీక్షిస్తారు. తర్వాత టైపింగ్ టెస్ ఉంటుంది. ఇందులో 8000 బైట్స్‌ను 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. చివరిగా మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థిని ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 18


టైర్-1 సీబీటీ తేది: మార్చి 3 నుంచి 26 వరకు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com