అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలను శుక్రవారం ఉదయం ఆయన తనయుడు, మంత్రి లోకేష్ విడుదల చేస్తారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, కొడుకు, కోడలు, మనవడి పేరుతో ఉన్న అన్ని ఆస్తుల వివరాలను బహిర్గతం చేయనున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. వీటిని ప్రకటించడం వరుసగా ఇది ఏడోసారి.