ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టులో అవకతవకలున్నాయి: పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 11:55 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చానన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో.. ఏ ఒక్క పార్టీదో కాదన్నారు. పోలవరం చాలా కష్టమైన, ఛాలెంజింగ్‌ ప్రాజెక్టు అన్నారు. ప్రాజెక్టుతో లాభమెంత.. నష్టమెంత అనేది పరిశీలించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com