జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పవన్ పరిశీలించారు. స్పిల్ వే, డయా ఫ్రం వాల్, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి అధికారులు పవన్‌కు వివరించారు. మ్యాప్ ద్వారా ప్రాజెక్టు సాంకేతిక అంశాలను సైతం అధికారులు వివరించారు.