నెల్లూరు: మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో పర్యటిస్తున్నారు. మినీ బైపాస్ రోడ్డులో సెంట్రల్ డివైడర్ల వద్ద నారాయణ మొక్కలు ట్రిమ్మింగ్ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… 110 మున్సిపాలిటీల్లో సెంట్రల్ డివైడర్ల నిర్మాణం చేపట్టామన్నారు. పోస్టర్, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.