ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:31 AM

పవి్త్ర స్నానాలు ఆచరించిన భక్తులు


  మచిలీపట్నం,మేజర్‌న్యూస్‌ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని నాగులేరు (మంచినీటి కాలువ) భక్తజనసంద్రంతో కిటకిటలాడింది. నాగులేరులో నీటి ప్రవాహం అంతగా లేకపోయినప్పటికీ భక్తుల తాకిడిని దృష్టిలోపెట్టుకుని ముందుజాగ్రత్తగా మున్సిపల్‌ అధికారులు నీబోర్లు వేసి జల్లు స్నానాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో వేలాదిమంది భక్తులు శుక్రవారం పవి్త్ర స్నానాలు ఆచరించారు. పురపాలక సంఘ అధికారులు చేసిన ఏర్పాట్ల కారణంగా తెల్లవారుజామున 4 గంటల నుండి నాగులేరుకు భక్తుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారిన కొద్దీ పట్టణ, పరిసరగ్రామాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. నాగులేరుకు రెండువైపులా పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. సాంప్రదాయబద్ధంగా తిలకధారణ అందుకున్న భక్తులు మూసివాయినాలు అందుకున్నారు.
పెద్దల స్మృత్యర్ధం శాస్త్రబద్ధంగా పొత్తర్లు సమర్పించారు. జంగం దేవర్ల గణగణ గంటల మోత, శంఖభేరి నాదాలతో నాగులేరు ఒడ్డు ప్రతిధ్వనించింది. సుమారు 40 వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. 


పుణ్యస్నానాల అనంతరం నాగులేరు వద్ద గల రసలింగేశ్వరస్వామి, నాగసాయి, శివగంగ, చింతగుంటపాలెంలోని శివాలయం, రాబర్‌‌టసన్‌పేట రామలింగేశ్వరస్వామి, బుట్టాయిపేట దత్తాశ్రమం తదితర ఆలయాలలో భక్తులు బారులుతీరి దైవదర్శనం చేసుకున్నారు. అర్చకులు వేదమంత్రాలను పఠిస్తూ నిర్వహించిన అభిషేకాల కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. చింతగుంటపాలెం నాగేశ్వరస్వామి దేవాలయంలో అర్చకులు చేబ్రోలు మరళీమనోహరశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయం్త్రం విద్యుద్ధీప కాంతులతో ఆలయాలన్నీ శోభాయమానంగా వెలుగులు చిమ్మాయి. 


మంత్రి, మున్సిపల్‌ ఛైర్మన్‌ పరిశీలన


  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే నాగులేరు ఒడ్డు, పరిసర ప్రాంతాలను మున్సిపల్‌ ఛైర్మన్‌ మోటమర్రి వెంకట బాబాప్రసాద్‌ శుక్రవారం ఉదయం నుంచి పర్యవేక్షించారు. పురపాలకసంఘం ఆధ్వర్యంలో నాగులేరుకు ఇరువైపులా భక్తుల కోసం షామియానాలు, విద్యుత్‌ దీపాలు, మైకులు, టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు, త్రాగునీరు, 108 వాహనాలను ఏర్పాటు చేశారు. స్నానఘట్టాలను ఆధునికీకరించారు. రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్‌పౌడర్‌ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్‌‌స  అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని బాబాప్రసాద్‌ ప్రారంభించారు. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నదీ, లేనిదీ బాబాప్రసాద్‌ ఎప్పటికప్పుడు భక్తులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు, భక్తులకు ఏర్పాటుచేసిన పలు ఏర్పాట్లను అధికారులు నిరంతరం గమనిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు, ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా బందరు డిఎస్పీ ఆధ్వర్యంలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేశారు. తెల్లవారుతున్న కొద్దీ భక్తుల రద్ధీ పెరగటంతో ప్రదాన రహదారిపై సుమారు అరకిలోమీటరు దూరం వాహనాలు నిలచిపోయాయి. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను నియం్తణ్ర చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగులేరులో పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు ఎన్‌.సి.సి, ఎన్‌.ఎస్‌.ఎస్‌, సత్యసాయి సేవాసమితి వాలంటీర్లు స్నానాల ఘాట్‌ల వద్ద, ట్రాఫిక్‌ నియం్తణ్రలోను, ఆలయం వద్ద తమ సేవలను అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com