ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజైన ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 03:34 PM

లాహోర్: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇవాళ విడుదలయ్యాడు. గత జనవరి నుంచి అతను గృహనిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం లాహోర్ కోర్టు అతనికి హౌజ్ అరెస్టును పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో హఫీజ్ ఇవాళ విముక్తి అయ్యాడు. రిలీజ్ సందర్భంగా సన్నిహితులు హఫీజ్‌కు స్వీట్లు తినిపించారు. జమాతుద్ దవా చీఫ్ హఫీజ్ అనుచరులు లాహోర్‌లోని జోహార్ టౌన్ ప్రాంతంలో ఉన్న అతని ఇంటిముందు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సుమారు 300 రోజుల పాటు హఫీజ్ హౌజ్ అరెస్టులో ఉన్నాడు. అయితే తాజాగా 30 రోజుల డిటెన్షన్ గురువారం అర్థరాత్రితో ముగిసింది. పాక్ కోర్టుకు చెందిన సమీక్షా బోర్డు హఫీజ్‌కు గృహ నిర్బంధాన్ని పొడిగించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే హఫీజ్ రిలీజ్ పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాది హఫీజ్ తలపై అమెరికా ప్రభుత్వం రూ.65 కోట్ల వెల పెట్టిన విషయం తెలిసిందే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com