ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరకొరియాకు క్యూబా మద్దతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 08:48 AM

ఉత్తరకొరియాకు ఊహించని మద్దతుదొరికింది. అణుపరీక్షల నేపథ్యంలో ఏకాకిగా మారిన ఉత్తరకొరియాకు క్యూబా మద్దతు పలికింది. క్యూబా రాజధాని హవానాలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రితో క్యూబా విదేశాంగ శాఖ మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా విధానాలను తూర్పారబట్టారు. ఎలాంటి చర్చలు లేకుండా ఆంక్షలు విధించడం, ఉగ్రవాద దేశాల సరసన ఉత్తరకొరియాను చేర్చడంపై ఈ రెండు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా ఏకపక్ష, నిర్హేతుకమైన డిమాండ్లను ఖండిస్తున్నామని ఉమ్మడి ప్రకటన చేశారు. ప్రజల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, వివాదాలకు శాంతియుతమైన ఒప్పందాల ద్వారా ముగింపుపలకాలని క్యూబా విదేశాంగ శాఖ మంత్రి సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com