షిమ్లా: లెఫ్టినెంట్ కల్నల్ కూతుర్ని రేప్ చేసిన కేసులో 56 ఏళ్ల ఆర్మీ కల్నల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ సెంటర్లో జరిగింది. తనను రేప్ చేసినట్లు 21 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్మీ కల్నల్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటన పట్ల ప్రాథమిక విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెడికల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ సౌమ్య సాంబశివన్ కూడా దృవీకరించారు. అయితే ఆ కల్నల్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.