ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసిఫిక్‌ మహాసముద్రంలో కుప్పకూలిన అమెరికా నేవీ విమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 02:30 PM

జపాన్‌లోని ఒకినావా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్రంలో అమెరికా నేవీకి చెందిన ఓ విమానం కుప్పకూలిపోవ‌డం అల‌జ‌డి రేపుతోంది. ఆ విమానంలో 11 మంది నేవీ సిబ్బంది ఉన్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని అమెరికా నేవీ కూడా ధ్రువీకరించింది. ఈ విమాన‌ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగాన్‌ సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్ర‌మాదంలో గల్లంతైన‌ సిబ్బంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ప్ర‌మాదం జపాన్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు జ‌రిగిన‌ట్లు అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల గురించి స‌మాచారం అందాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com