ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పయ్యావుల కేశవ్ ఇంట ప్రారంభమైన పెళ్లిసందడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2017, 03:04 PM

ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. కేశవ్ అన్న శీనప్ప కుమార్తె వివాహం ఈ నెల 23న అనంతపురంలో ఘనంగా జరగనుంది. వీరి ఇంట చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న తొలి వివాహం కావడంతో, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురంలోని బళ్లారి బైపాస్ సమీపంలోని ఎంవైఆర్ ఫంక్షన్ లో పెళ్లి జరగనుంది. గత 10 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అనంతపురంలోని రామ్ నగర్ లో గల నివాసంలో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లి కుమారుడు ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు. ఈ పెళ్లికి వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్పీలు వెంకట్రావు, నర్సింగప్ప, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడులతో కలసి పెళ్లి ఏర్పాట్లను కేశవ్ నిన్న పరిశీలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com