నామినేషన్ దాఖలు చేసిన గుజరాత్ సీఎం విజయ్‌రూపాని

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 20, 2017, 02:23 PM
 

గుజరాత్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని రాజ్‌కోట్ పశ్చిమ స్థానం నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో సీఎం విజయ్ రూపాని తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. గుజరాత్‌లో డిసెంబర్ 9, 14 వ తేదీల్లో 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే మూడు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించింది.