ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర మరోసారి స్వల్పంగా తగ్గగా.. డీజిల్ ధర పెరిగింది. గురు, శుక్రవారాల్లో 8 పైసల వరకు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర.. నేడు (నవంబర్ 18న) మరో 5 పైసలు తగ్గింది. శుక్రవారంతో పోలిస్తే నేడు (నవంబర్ 18న) డీజిల్ ధర 3 పైసల వరకు పెరిగింది. నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.74 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 63.45గా ఉంది. ఇక ఆంధ్ర రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.56గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.65.44గా ఉంది.