పుణె : తొలి టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ రెన్షా తర్వాత టెయిలెండర్ మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ ఆ జట్టుకు ఊపిరి పోసింది. 205 పరుగుల స్కోరు వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కంగారూలు.. మరో వికెట్‌ను కాపాడుకోగలిగారు. 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్టార్క్, హాజల్‌వుడ్ క్రీజులో ఉన్నారు. రెన్షా 68, వార్నర్ 38, స్మిత్ 27, మార్ష్ 16, హాండ్స్కంబ్ 22 పరుగులు చేశారు. పేసర్ స్టార్క్ 57 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఉమేష్ యాదవ్ 4, జడేజా, అశ్విన్ చెరో 2, జయంత్ ఒక వికెట్ తీశారు.