వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గూడూరు టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్. సుధాకర్ రెడ్డి, గూడూరు పట్టణ అధ్యక్షుడు గజేంద్రగోపాల్ నాయుడు, కర్నూలు లోక్ సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి దండు సుందర్ రాజు, మైనార్టీ విభాగం నాయకుడు సలీమ్, నాయకులు నాగప్ప యాదవ్, తులసీకృష్ణ, కురువ హనుమంతు, వడ్డే నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |