ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లురు గ్రామంలో హోలీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. హోలీ రోజున పురుషులంతా ఆడవారి వేషధారణలో కనిపిస్తారు. రెండు రోజులపాటు ఇలాగే ఉంటారు. ఆడ వేషం ధరించి రతి మన్మథులను పూజిస్తారు. ఈ గ్రామం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ ఆచారం తరతారాల నుంచి కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కోరికలు తీరుతాయని వారు నమ్ముతారు. చీర కట్టుకొని, నగలు, పూలు ఆలంకరించుకుని అచ్చం మహిళల్లా రెడీ అవుతారు. అనంతరం రతీ మన్మథులను పూజిస్తారు.