ఒడిశా: పటాకుల దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని రూర్కెలాలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణం షార్ట్సర్కూట్గా సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది.