అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. హోళగుందకు చెందిన సి నాగరాజు మోటార్ సైకిల్‌పై 192 ఓరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ కర్నాటక టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని మోటార్ సైకిల్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుని అరెస్టు చేశామని తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |