కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి పోవడం గమనార్హం. అవుకులో అత్యధికంగా 40. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మిడుతూరులో 40. 23, కోవెలకుంట్ల మండలం కలుగొట్లలో 40. 15, బేతంచెర్లలో 40. 12, హాలహర్విలో 39. 97 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్త మహదేవయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
![]() |
![]() |