కర్నూలు నగరంలో సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీలోని దక్షిణ షిరిడీ సాయి బాబా దేవస్థానంలో ఈ నెల 17వ తేదీన హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండలి కార్యదర్శి మహాబలేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారి భక్తుల సమక్షంలో షిరిడీలో జరిగే విధంగా హోలీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు హోలీ సంబరాలు, 8 గంటలకు పల్లకి సేవ, మహారథోత్సవం, కోలాటం, తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |