ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు కర్నూలు స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జిల్లాలోని ఎంపీడీవోలతో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో ఎం. వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మండల పరిషత్ కార్యాలయాల్లో ఆడిట్ అబ్జక్షన్స్ వేసవిలో క్రాష్ ప్రోగ్రామ్, సీపీడబ్ల్యూఎస్ స్కీంలు తనిఖీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామ సచివాలయాల పనితీరు తదితర అన్ని అంశాలపై సమావేశంలో జెడ్పీ చైర్మన్ చర్చిస్తారని తెలిపారు. ప్రతి ఒక్క ఎంపీడీవో కచ్చితంగా హాజరు కావాలని ఆయన కోరారు.
![]() |
![]() |