హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీ వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది వై. జయరాజు ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ పి. కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వై. జయరాజు మాట్లాడుతూ. ఏపీ విభజన చట్టంలో వెంటనే సవరణలు చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తేవాలన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి హైకోర్టు సాధనకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.
![]() |
![]() |