ఉయ్యాలవాడ మండలంలోని హరివరం గ్రామానికి చెందిన 7వ వార్డు మెంబరు తోగట సుబ్బరామయ్య (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు పురుగుల మందు తాగిన సుబ్బరామయ్యను బంధువులు గుర్తించి కోవెలకుంట్లలోని ఓ వైద్యశాలకు తరలించారు.
ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు
![]() |
![]() |