శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి ఆదాయం రూ. 66, 52, 188 వచ్చిందని దేవాలయ సహాయ కమిషనర్ వాణి తెలిపారు. మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఆదోని ఎండోమెంట్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. వెండి 8. 900 కేజీలు, బంగారం 58 గ్రాములు భక్తులు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, కుమార్ ఓబులేష్, విజయ్, అర్చక, దేవాలయం సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |