నంద్యాల పట్టణానికి చెందిన షేక్ మక్బూల్ హుస్సేన్ మేన్స్ ఫిజిక్ పోటీలో తృతీయ స్థానం మరియు 60 కేజీ బరువు బాడీ బిల్డింగ్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించారని బాడీ లైన్ జిమ్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకుడు కోచ్ షేక్ ఖాజా మోహిద్దీన్ తెలిపారు. వారు మాట్లాడుతూ 90 కేజీల బరువు బాడీ బిల్డింగ్ కేటగిరీలో షేక్ హాబీబుల్లా నాల్గవ స్థానంలో పతకాలు సాధించడం జరిగిందని అన్నారు. మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్డ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13 ఆదివారం ఒంగోలు లో జరిగిన రాష్ట్ర స్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని పథకాలు సాధిచారని అన్నారు.
![]() |
![]() |